Siddhartha School Alumni Meet: జగిత్యాల సిద్ధార్థ పాఠశాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా!

తెలంగాణ పత్రిక (APR.27): Siddhartha School Alumni Meet, జగిత్యాల జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఘనంగా నిర్వహించారు. 1999-2000 బ్యాచ్ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సిల్వర్ జూబ్లీ వేడుకలను గురువులు, మిత్రులతో కలిసి వైభవంగా నిర్వహించారు.

Siddhartha School Alumni Meet 2025

దుబాయ్, నాగపూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు, జగిత్యాల పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో
ఒకే వేదికపై కలుసుకొని, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం, దివంగత మిత్రుల ఆత్మశాంతి కోసం నివాళులర్పించారు.

Advertisement

Advertisement

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రావు జ్యోతిని వెలిగించి సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి ఉపాధ్యాయులు
గిరీశం, ప్రభాకర్, గంగాధర్, రాజేందర్, సతీష్, సదానందం, అనిల్, శ్రీదేవి మేడం, పద్మావతి మేడం లను శాలువాలు, పూలమాలలతో
సన్మానించారు. కార్యక్రమం నostalgic మరియు భావోద్వేగాల పరవశంలో సాగింది.

Advertisement

Read More: CBSE Result 2025 Live: త్వరలో విడుదల కానున్న సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు – పూర్తి వివరాలు ఇక్కడ!

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 2 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →