PMJ Robbery Case: కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన PMJ Jewellers దోపిడీ కేసులో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. Gaush Alam నిర్వహించిన మీడియా సమావేశంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.

PMJ Robbery Case మొత్తం 13 మంది గుర్తింపు
పోలీసుల దర్యాప్తులో ఈ కేసులో మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా, మిగతా నిందితుల కోసం పలు రాష్ట్రాల్లో గాలింపు కొనసాగుతోంది.
కాల్పులతో జరిగిన దోపిడీ
మే 3న PMJ జ్యువెలరీ షాపులో జరిగిన ఈ దోపిడీలో దుండగులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో:
నలుగురు ఉద్యోగులకు బుల్లెట్ గాయాలు అయ్యాయి, 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
PMJ Robbery Case జైలు నుంచే మాస్టర్ ప్లాన్?
పోలీసుల ప్రకారం ఈ దోపిడీకి బీహార్‌కు చెందిన సుబోధ్ సింగ్ ప్రధాన సూత్రధారి. Subodh Singh ప్రస్తుతం బీహార్‌లోని పూర్ణియా జైలులో ఉన్నప్పటికీ అక్కడి నుంచే ఈ దోపిడీ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.
పలు రాష్ట్రాల్లో నేర చరిత్ర
సుబోధ్ సింగ్ గ్యాంగ్ బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్,మహారాష్ట్ర, గుజరాత్,ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పలు దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అరెస్ట్ అయిన నిందితులు
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలోరఘునాథ్ కర్మాకర్ రవీష్ కుమార్ మెహతాబ్ ఖాన్ ఉన్నారు. వీరిలో ఇద్దరు కాల్పులు జరిపిన ప్రధాన దుండగులుగా పోలీసులు గుర్తించారు.
రెండు నెలల ముందే రెక్కీ
దర్యాప్తులో నిందితులు రెండు నెలల ముందే షాప్‌పై రెక్కీ నిర్వహించినట్లు బయటపడింది. ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల ప్రాంతాలను పరిశీలించిన తర్వాత కరీంనగర్‌ను టార్గెట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
దోపిడీ తర్వాత పరారీ
దోపిడీ అనంతరం నిందితులు:బైక్‌లపై ధర్మపురికి చేరుకున్నారు, అక్కడి నుంచి మూడు గ్రూపులుగా విడిపోయారు, రైలు, బస్సుల ద్వారా పరారయ్యారు అని దర్యాప్తులో వెల్లడైంది.
స్వాధీనం చేసిన వస్తువులు
నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ.51 వేల నగదు రెండు మొబైల్ ఫోన్లు రెండు సిమ్ కార్డులు నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
సుబోధ్ సింగ్ విచారణకు సిద్ధం
సుబోధ్ సింగ్‌ను పూర్ణియా జైలులో విచారించేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు పోలీసులు తెలిపారు.
PMJ దోపిడీ కేసులో ముగ్గురు అరెస్టుతో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. అంతర్రాష్ట్ర గ్యాంగ్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu

