Yadagirigutta Temple Board: తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Yadagirigutta Temple Board ఛైర్మన్గా ఎం. సత్యనారాయణ రెడ్డి
కొత్త పాలకమండలి ఛైర్మన్గా ఎం. సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. అలాగే పలువురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది.
పాలకమండలి సభ్యులు వీరే
- ఎం. సత్యనారాయణ రెడ్డి – ఛైర్మన్
- జి. వినోద్ వెంకటస్వామి
- కొనిదెల సురేఖ
- చిల్లపగారి విజయరాజం
- విజయేందర్ తుల్లా
- పి. ఈశ్వరమ్మ యాదవ్
- గుండు మల్లయ్య
- స్వాతి కాంతామణి
- ఎం. రాఘవేందర్ రావు
- లక్ష్మీనారాయణ నాయక్
- ఫౌండర్ ట్రస్టీ
ఎక్స్ అఫీషియో సభ్యులు
ఈ పాలకమండలిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎండోమెంట్స్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్స్ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (YTDA) వైస్ ఛైర్మన్, దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (EO), స్థానాచార్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.
Yadagirigutta Temple Board రెండేళ్ల పదవీకాలం
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫౌండర్ ట్రస్టీ, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగిలిన సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. కొత్త పాలకమండలి ఆధ్వర్యంలో యాదాద్రి ఆలయ అభివృద్ధి, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే కార్యక్రమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu
