Gas Cylinder Price July 2026: జూలై 1 నుంచి కమర్షియల్ LPG సిలిండర్ వినియోగదారులకు ఊరట లభించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.183.50 వరకు తగ్గించాయి.

ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, ధాబాలు, చిన్న వ్యాపారులకు ఇంధన ఖర్చు కొంత మేర తగ్గనుంది.
Gas Cylinder Price July 2026 ఇంటి గ్యాస్ ధరలో మార్పు లేదు
అయితే 14.2 కేజీల గృహ వినియోగ LPG సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గృహ వినియోగదారులు ప్రస్తుతం ఉన్న ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ప్రధాన నగరాల్లో కమర్షియల్ LPG కొత్త ధరలు
| నగరం | కొత్త ధర | తగ్గిన మొత్తం |
|---|---|---|
| ఢిల్లీ | ₹2,930 | ₹183.50 |
| లక్నో | ₹3,052.50 | ₹183.50 |
| కోల్‌కతా | ₹3,081.50 | ₹174 |
| పాట్నా | ₹3,227 | తగ్గింపు అమలు |
గృహ వినియోగ (14.2 కేజీల )LPG ధరలు
| నగరం | 14.2 కేజీల సిలిండర్ ధర |
|---|---|
| ఢిల్లీ | ₹942 |
| లక్నో | ₹979.50 |
| కోల్‌కతా | ₹968 |
| పాట్నా | ₹1,031.50 |
2026లో తొలి ధర తగ్గింపు
ఈ ఏడాది కమర్షియల్ LPG సిలిండర్ ధర తగ్గడం ఇదే మొదటిసారి.
జనవరి నుంచి జూన్ వరకు వరుసగా ధరలు పెరుగుతూ వచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా కమర్షియల్ గ్యాస్ రేట్లు భారీగా పెరిగాయి.
ఇప్పుడు ధరలు తగ్గడంతో వ్యాపారులకు కొంత ఊరట లభించనుంది.
ఎవరికి లాభం?
- హోటళ్లు
- రెస్టారెంట్లు
- ధాబాలు
- బేకరీలు
- టీ స్టాళ్లు
- క్యాటరింగ్ వ్యాపారులు
- ఫుడ్ అవుట్‌లెట్లు
Read More: Read Today’s E-paper News in Telugu
