Advertisement

అర్హత లేని వైద్యం : RMP క్లినిక్ సీజ్..!

Telanganapatrika (July 12): RMP క్లినిక్ సీజ్ , ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాను సారం అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర గ్రామ సబ్‌సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం. శ్రీధర్, స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

సబ్‌సెంటర్‌లో రికార్డులను పరిశీలించిన అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
విధులకు కచ్చితంగా సమయానికి హాజరుకావడం, అన్ని రికార్డులను సరిగ్గా నిర్వహించడం, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించడం వంటి అంశాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

ఈ సందర్భంగా అధికారులు గ్రామ ప్రజలతో మాట్లాడి, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నివారణపై వివరించారు. ప్రభుత్వ దవాఖానలను వినియోగించుకోవాలని, అర్హత కలిగిన వైద్యుల వద్దే వైద్యం పొందాలని సూచించారు.

ఆరోగ్యాన్ని ఆడుకుంటున్న నకిలీ వైద్యులు RMP క్లినిక్ సీజ్

తదుపరి, గ్రామంలో అనధికారంగా పనిచేస్తున్న ఓ ఆర్. ఎం. పి క్లినిక్‌ను సీజ్ చేశారు.
ఆర్. ఎం. పి అనధికార వైద్యులు ఎక్కువగా నొప్పి ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ వంటి మందులు వినియోగించటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి,” అని అధికారులు తెలిపారు.ఆర్. ఎం. పి లకు కేవలం ప్రాథమిక వైద్యం (ఫస్ట్ ఎయిడ్) మాత్రమే అనుమతించబడిందని, ఆ దాటితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మీ ఆరోగ్యం మీ బాధ్యత. ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించండి. సరైన వైద్యుల దగ్గర మాత్రమే చికిత్స తీసుకుని ఆరోగ్యంగా ఉండండి అని అధికారులు ప్రజలకు సూచించారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *