Indhiramma Housing Scheme: అదిలాబాద్ జిల్లా సోనాల మండలం కోట (కే) గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద లబ్ధిదారురాలైన లోకాండే దీక్ష అనే మహిళకు ఘోర అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. ఆమె ఇల్లు నిర్మించిన కాంట్రాక్టర్ తక్కువ నాణ్యత గల పదార్థాలతో ఇల్లు నిర్మించడమే కాకుండా, అదనంగా రూ.6.30 లక్షల ప్రామిసరీ నోట్‌పై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

కాంట్రాక్టర్ వేధింపులు, బెదిరింపులు
దీక్ష తెలిపిన ప్రకారం, కాంట్రాక్టర్ కాంబ్లే సత్యనారాయణ తన భర్త మారుతిని వేధిస్తూ రూ.1 లక్ష డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడట. ఇది ప్రభుత్వ పథకంలో మంజూరైన మొత్తం అయినప్పటికీ, అదనంగా డబ్బు అడుగుతున్నాడని ఆమె ఆరోపించారు.
ప్రజల ఎదుట అవమానం
దీక్ష తెలిపినట్టు, డబ్బు చెల్లించలేదనే కారణంతో కాంట్రాక్టర్ సోనాల మండల కేంద్రంలోని బస్ స్టాండ్‌లో మారుతిని ప్రజల ఎదుటే ఒక కంబానికి కట్టేసి అవమానపరిచాడు. ఈ ఘటనతో గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు.
అధికారుల జోక్యం కోరిన లబ్ధిదారులు
దీక్ష, తన భర్తపై జరుగుతున్న వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని అధికారులను వేడుకున్నారు. కాంట్రాక్టర్ చేసిన దౌర్జన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పథకాలపై అవినీతి నీడ
ఈ ఘటనతో ఇందిరమ్మ హౌసింగ్ పథకం అమలులో అవినీతి, దుర్వినియోగంపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రభుత్వం లబ్ధిదారులకు నిజమైన ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
