Komuravelli Railway Station: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంకు వచ్చే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆలయం సమీపంలో నిర్మిస్తున్న కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి G. Kishan Reddy వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, రూ.5.63 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్ పనులు 99.5 శాతం పూర్తయ్యాయి. త్వరలోనే ప్రారంభోత్సవం నిర్వహించే అవకాశం ఉందన్నారు.
Komuravelli Railway Station స్టేషన్‌లో ఉండే ప్రధాన సౌకర్యాలు
కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ఆధునిక సదుపాయాలు కల్పించారు.
- 450 మీటర్ల పొడవైన హై-లెవల్ ప్లాట్‌ఫారం
- 5 ప్లాట్‌ఫారం షెల్టర్లు
- విశాలమైన వెయిటింగ్ హాల్
- టికెట్ బుకింగ్ కౌంటర్లు
- పార్కింగ్ సౌకర్యం
- తాగునీటి వసతి
- ఆలయ శిల్పకళను ప్రతిబింబించే మ్యూరల్ పెయింటింగ్స్
- రాజీవ్ రహదారి (SH-1)తో మెరుగైన రోడ్డు అనుసంధానం
https://twitter.com/kishanreddybjp/status/2077235504685416806/photo/1
Komuravelli Railway Station భక్తులకు భారీ ప్రయోజనం
ఈ రైల్వే స్టేషన్ ప్రారంభమైతే కొమురవెల్లి మల్లన్న ఆలయానికి నేరుగా రైలు మార్గంలో చేరుకోవడం సులభం అవుతుంది. దీంతో భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడమే కాకుండా, ఆధ్యాత్మిక పర్యాటకం, స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
