CBSE New Rules : CBSE కొత్త రూల్.. 10వ బోర్డు ఎగ్జామ్‌లో మూడో భాష ఉండదట

CBSE New Rules: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 10వ తరగతి మూడో భాష (Third Language – R3)పై కీలక స్పష్టత ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో చేరే విద్యార్థులకు, 10వ తరగతి బోర్డు పరీక్షలో మూడో భాషకు ప్రత్యేక బోర్డు పరీక్ష ఉండదని ప్రకటించింది.

అయితే, స్కూల్ నిర్వహించే అంతర్గత (School-Based Assessment) పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అప్పుడే CBSE 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.

Advertisement

CBSE New Rules ఏం మారుతోంది?

  • 10వ తరగతి బోర్డు పరీక్షలో మూడో భాష ప్రశ్నపత్రం ఉండదు.
  • కానీ స్కూల్ నిర్వహించే R3 అసెస్‌మెంట్‌లో పాస్ కావడం తప్పనిసరి.
  • R3లో ఫెయిల్ అయితే ఫలితాలు ప్రకటించే ముందు మరో అవకాశం ఇస్తారు.
  • ఆ రీ-అసెస్‌మెంట్‌ను సంబంధిత స్కూల్ నిర్వహిస్తుంది. 9వ తరగతిలో ఫెయిల్ అయితే?

9వ తరగతిలో R3 అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణులు కాకపోయినా విద్యార్థులను 10వ తరగతికి ప్రమోట్ చేస్తారు. అయితే, 10వ తరగతి చదువుతున్న సమయంలో పెండింగ్‌లో ఉన్న R3 పరీక్షను క్లియర్ చేయాలి.

Advertisement

కొత్త మూడు భాషల విధానం

NEP 2020 ప్రకారం, 2026-27 నుంచి 9వ తరగతిలో చేరే ప్రతి విద్యార్థి మూడు భాషలు చదవాలి. వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు (Bhartiya Bhashas) ఉండాలి.

Advertisement

ఇప్పటికే ఇంగ్లిష్ + ఫ్రెంచ్ లేదా ఇంగ్లిష్ + జర్మన్ వంటి రెండు విదేశీ భాషలు చదువుతున్న విద్యార్థులకు ఒకసారి మాత్రమే సడలింపు ఇచ్చింది. వారు అదనంగా ఒక భారతీయ భాషను మూడో భాషగా తీసుకోవాలి.

ప్రస్తుతం 10వ తరగతిలో ఉన్న వారికి?

2026-27లో ఇప్పటికే 10వ తరగతిలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి మార్పులు ఉండవు. వారు ఇప్పటివరకు అమలులో ఉన్న రెండు భాషల విధానంలోనే పరీక్షలు రాస్తారు.

CBSE New Rules భవిష్యత్తులో పరిస్థితి?

CBSE ప్రకారం, 2026-27లో 6వ తరగతిలో చేరే విద్యార్థులు 10వ తరగతికి వచ్చే సమయానికి మూడో భాష కూడా బోర్డు పరీక్ష సబ్జెక్టుగా మారే అవకాశం ఉంది. అప్పటికి కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యా వనరులు పూర్తిగా సిద్ధంగా ఉంటాయి.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →