Ichoda News 2025| ఇచ్చోడలో 32 లక్షల మోసాల కలకలం.

Telanganapatrika (July 29):  Ichoda News 2025 ఇచ్చోడలో చెన్నపవర్ అభిషేక్ అనే వ్యక్తి స్నేహం పేరుతో 32 లక్షలు మోసం చేసిన కేసు – సిఐ బి రాజు ఇతర బాధితులను ఫిర్యాదు చేయమని కోరారు.

Join WhatsApp Group Join Now

Ichoda News 2025 case in Ichoda, Telangana – 32 lakh fraud
  • స్నేహం పేరుతో కుచ్చుటోపి,
  • నమ్మ బలికి 32 లక్షలతో ఉడయించిన…..చెన్నపవర్ అభిషేక్
  • ఇచ్చోడ సిఐ బందరి రాజు

Read More: MLA Medipally Satyam Event – New Ration Cards పంపిణీ వివరాలు

Cheating Case In Ichoda

బోథ్ ఆర్సీ షేక్ షాకీర్ :-

అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ మండలం కేంద్రంలో మంగళవారం రోజునా అక్కనపెల్లి శివకుమార్ .. ఇచ్చోడ గ్రామానికిచెందిన వ్యక్తి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసినది ఏమనగా తన యొక్క మిత్రుడు అయినటువంటి చెన్నపవర్ అభిషేక్ గ్రామం.. ఇచ్చోడ అనునతను డైరీ ఫాం పెడుతున్నానని స్నేహం పేరుతో తన వద్ద మొత్తం 4,50,000/-rs తీసుకొని, తనకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పారిపోయారని తర్వాత తెలుసుకొనగా నిందితుడు దాదాపు 20 మంది వద్ద ఇలాగే నమ్మించి దాదాపు 32 లక్షల రూపాయలు మోసగించినాడని తెలిసింది. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి నిందితుని కొరకు గాలిస్తున్నారు.

ఇచ్చోడ సిఐ బి రాజు ఇంకా ఎవరైనా మోసగింపబడిన వ్యక్తులు ఉన్నట్లయితే ఇచ్చోడా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇవ్వవలసిందిగా ఒక ప్రకటనలో తెలిపినారు.

నేషనల్ సైబర్ క్రైమ్ ఫిర్యాదు పోర్టల్ – సైబర్ క్రైమ్ ఫిర్యాదు

One Comment on “Ichoda News 2025| ఇచ్చోడలో 32 లక్షల మోసాల కలకలం.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *