Telanganapatrika (July 29): MLA Medipally Satyam Event – గంగాధర మండలంలో రేషన్ కార్డులు పంపిణీ చేసి ప్రజలకు నూతన సేవలు అందజేశారు. తాజా వివరాలు చదవండి.

MLA Medipally Satyam Event.
రాష్ట్రమంతా పండుగలా రేషన్ కార్డుల పంపిణీ
- అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం
- గంగాధర మండలంలో 5515 రేషన్ కార్డులు పంపిణీ
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
MLA Medipally Satyam Event -గంగాధర మండలం మంగపేట జి.వి.ఆర్ గార్డెన్ లో మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ పమేలాసత్పత్తితో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ… “నూతన రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగలా జరుగుతోంది. ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది” అని పేర్కొన్నారు.
2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రేషన్ షాపుల ద్వారా 9 రకాల వస్తువులను అందజేసింది అని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో దొడ్డు బియ్యం పంపిణీ చేశారు అని ఆ బియ్యం తినలేక ప్రజలు వాటిని అమ్ముకున్నారు పేర్కొన్నారు. అధికారులు సామాన్యుడు అందరూ ఒకేలా సన్న బియ్యంతో కడుపునిండా భోజనం చేయాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందిఅని పేర్కొన్నారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకూడదని మూడు నెలలకు ఒకేసారి రేషన్ బియ్యం పంపిణీ చేసింది. మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది అని గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో చాలామంది మహిళలు పథకాలకు దూరమైనారు అని తెలిపారు.
గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరిస్తే ఊరి అని చెప్పాడు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను బందు చేస్తామన్నాడు.నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకే వడ్లు కొనుగోలు చేసింది. సన్న వడ్లకు రూ. సన్న వడ్లకు రూ. 500 మద్దతు ధర చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని, రైతు భరోసా పథకం ద్వారా కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గత బిఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. చొప్పదండి నియోజకవర్గం వరప్రదాయని నారాయణపూర్ రిజర్వాయర్ ను పూర్తి చేయడంతో పాటు, కుడికాలువ నిర్మాణాన్ని పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని
చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. దశాబ్ద కాలం తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టి ప్రజల కళ్ళల్లో ఆనందం నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు . జిల్లా కలెక్టర్ పమేలసత్పత్తి పనితీరు గొప్పగా ఉంది అని హర్షం వ్యక్తం చేసారు.
జిల్లాలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభినందనలు అందుకుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ పమేలసత్పత్తి మాట్లాడుతూ…..
చాలా కాలంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయింది అని ప్రజలు రేషన్ కార్డులు కావాలని అడిగి అలసిపోయారు.అధికారుల దగ్గర కూడా చెప్పడానికి సమాధానం లేకపోయింది. నూతన రేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని జిల్లాలోని 15 మండలాల్లో 78,500 కొత్త కార్డులు, మార్పులు చేర్పులు రేషన్ కార్డులు వచ్చాయి.
జిల్లాలో అత్యధికంగా గంగాధర మండలంలో 5515 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి అని తెలిపారు. రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తుండడంతో పేద మధ్య తరగతి ప్రజలకు లాభం చేకూరుతుంది అని ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు.
- ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి
- సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు
- సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్
- మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్
- ఎమ్మార్వో అనుపమ రావు
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్
- బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య
- రామిడి రాజిరెడ్డి, బుర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, అజయ్ రావు, తోట సంధ్య, రోమాల రమేష్, సత్తు కనుకయ్య, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపు రెడ్డి, గంగాధర సుదర్శన్, రాచమల్ల భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ముచ్చ శంకర్, చందు, వంగల శ్రీనివాస్, మంత్రి మహేందర్, పానుగంటి సత్యం. తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పౌర సరఫరాల శాఖ – రేషన్ కార్డు సమాచారం : https://epds.telangana.gov.in/
Read More: PDSU School Hostel Issues Nizamabad – ప్రభుత్వ భవనాలపై ఆందోళన!

One Comment on “MLA Medipally Satyam Event – New Ration Cards పంపిణీ వివరాలు”