Telangana man buys bike with Rs 10 coins: నల్గొండ చిన్నచిన్న పొదుపులు కూడా పెద్ద కలలను నిజం చేస్తాయని తెలంగాణలోని ఓ వ్యక్తి నిరూపించాడు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండె రఘుపతి ఏళ్ల తరబడి ప్రతి రూ.10 నాణెాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాడు. చివరకు ఆ పొదుపుతో ₹1.10 లక్షల విలువైన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Telangana man buys bike with Rs 10 coins రఘుపతి తనకు ఎప్పుడైనా రూ.10 నాణెం వచ్చినప్పుడల్లా ఖర్చు చేయకుండా ప్రత్యేకంగా దాచుకునేవాడు. ఇలా సంవత్సరాల పాటు పొదుపు చేసిన నాణేల విలువ ₹1.10 లక్షలకు చేరింది.
ఆ తర్వాత సంచుల నిండా రూ.10 నాణేలు తీసుకుని బైక్ షోరూమ్‌కు వెళ్లాడు. ఒక్కసారిగా అంత పెద్ద మొత్తంలో నాణేలు చూసిన షోరూమ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. వాటిని ఎలా లెక్కించాలా అని తొలుత సందిగ్ధంలో పడ్డారు.
అయితే రఘుపతి పట్టుదల, పొదుపు అలవాటును మెచ్చుకున్న షోరూమ్ యాజమాన్యం అన్ని నాణేలను స్వీకరించి, కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను ఆయనకు అందజేసింది.
Telangana man buys bike with Rs 10 coins
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “చిన్న పొదుపే పెద్ద విజయానికి దారి” అంటూ నెటిజన్లు రఘుపతిని ప్రశంసిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu

