ITR Filing 2026: Assessment Year (AY) 2026-27 కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈసారి అన్ని పన్ను చెల్లింపుదారులకు ఒకే గడువు లేదు. మీరు ఏ ITR ఫారం దాఖలు చేస్తున్నారో, మీ ఆదాయ స్వభావం ఏమిటో, ఖాతాలకు ఆడిట్ అవసరమా లేదా అనే అంశాల ఆధారంగా చివరి తేదీ మారుతుంది.

ITR Filing 2026 ITR ఫైలింగ్ ముఖ్యమైన గడువులు
| పన్ను చెల్లింపుదారుల వర్గం | చివరి తేదీ |
|---|---|
| ITR-1, ITR-2 దాఖలు చేసే వ్యక్తులు | జూలై 31, 2026 |
| ఆడిట్ అవసరం లేని ITR-3, ITR-4 | ఆగస్టు 31, 2026 |
| ఆడిట్ అవసరమైన వ్యాపారాలు, నిపుణులు | అక్టోబర్ 31, 2026 |
| ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్ అవసరమైతే | నవంబర్ 30, 2026 |
| ఆలస్యంగా (Belated Return) దాఖలు | డిసెంబర్ 31, 2026 |
| సవరించిన రిటర్న్ (Revised Return) | మార్చి 31, 2027 |
| Updated Return (ITR-U) | మార్చి 31, 2031 |
ITR Filing 2026 ITR ఏ ITR ఫారం ఎవరికి?
ITR-1 (Sahaj) ఈ ఫారం క్రింది వారికి వర్తిస్తుంది.
- వార్షిక ఆదాయం ₹50 లక్షల వరకు
- జీతం లేదా పెన్షన్ ఆదాయం
- ఒక ఇంటి నుంచి వచ్చే ఆదాయం
- వడ్డీ వంటి ఇతర ఆదాయం
- సంవత్సరానికి ₹5,000 వరకు వ్యవసాయ ఆదాయం
- నిర్దిష్ట పరిమితిలో దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG)
ITR-2 ఈ ఫారం క్రింది వారికి అనుకూలం.
- వ్యాపార ఆదాయం లేని వ్యక్తులు
- జీతం లేదా పెన్షన్ పొందేవారు
- ఒకటి కంటే ఎక్కువ ఇళ్ల నుంచి ఆదాయం
- షేర్లు, ఆస్తుల అమ్మకాల ద్వారా క్యాపిటల్ గెయిన్స్
- వడ్డీ, డివిడెండ్ వంటి ఇతర ఆదాయం
ITR-3 ఈ ఫారం క్రింది వారికి వర్తిస్తుంది.
- వ్యాపారం చేసే వ్యక్తులు
- వృత్తి నిపుణులు
- సంస్థల్లో భాగస్వాములు
- ఖాతాల పుస్తకాలు నిర్వహించే పన్ను చెల్లింపుదారులు
ITR-4 (Sugam) ఈ ఫారం క్రింది వారికి వర్తిస్తుంది.
- వార్షిక ఆదాయం ₹50 లక్షల వరకు
- Presumptive Taxation Scheme కింద వ్యాపారం లేదా వృత్తి నిర్వహించే వ్యక్తులు
- HUFలు
- LLP కాని సంస్థలు
- ITR-4 ఎవరికి వర్తించదు?
ఈ కేటగిరీల్లో ఉన్నవారు ITR-4 దాఖలు చేయలేరు.
- కంపెనీ డైరెక్టర్లు
- షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నవారు
- Section 112A కింద ₹1.25 లక్షలకు మించిన LTCG
- విదేశాల్లో ఆస్తులు లేదా బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు
- విదేశీ ఆదాయం పొందేవారు
- వార్షిక ఆదాయం ₹50 లక్షలకు మించినవారు
ఈసారి కొత్తగా ఏముంది?
ఈ ఏడాది ఆదాయపు పన్ను శాఖ అన్ని ITR ఫారాలను ఒకేసారి విడుదల చేయలేదు. దశలవారీగా ఆన్‌లైన్ ఫైలింగ్ మరియు Excel Utilities అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ITR-1, ITR-2, ITR-4 కోసం ఆన్‌లైన్ ఫైలింగ్‌తో పాటు Excel Utilities కూడా అందుబాటులో ఉన్నాయి.
గడువులోపు ITR ఫైల్ చేయడం ఎందుకు ముఖ్యం? చివరి తేదీ దాటితే…
ఆలస్య రుసుము (Late Fee) చెల్లించాల్సి రావచ్చు. బకాయి పన్నుపై వడ్డీ పడే అవకాశం ఉంది. రీఫండ్ ఆలస్యం కావచ్చు. ఇతర పన్ను సంబంధిత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే సరైన ITR ఫారాన్ని ఎంపిక చేసి, గడువులోపే రిటర్న్ దాఖలు చేయడం మంచిది.
ITR Filing 2026
- అందరికీ జూలై 31 డెడ్‌లైన్ కాదు.
- ITR ఫారం ఆధారంగా చివరి తేదీ మారుతుంది.
- ITR-1, ITR-2 చివరి తేదీ జూలై 31.
- ITR-3, ITR-4 (ఆడిట్ అవసరం లేకపోతే) ఆగస్టు 31.
- ఆడిట్ అవసరమైతే అక్టోబర్ 31 వరకు గడువు.
- ఆలస్యంగా కూడా కొన్ని షరతులతో రిటర్న్ దాఖలు చేయొచ్చు.
Read More: Read Today’s E-paper News in Telugu

