E20 Petrol Facts: దేశంలో E20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక సందేహాలు, అపోహలు వైరల్ అవుతున్నాయి. ఇంజిన్ పాడవుతుందని, నీటి వినియోగం అధికమని, వాహన వారంటీ రద్దవుతుందని ప్రచారం జరుగుతోంది.

E20 Petrol Fact ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందిస్తూ E20 పెట్రోల్‌పై వస్తున్న 10 ప్రధాన అపోహలకు సమాధానాలు ఇచ్చింది.
E20 పెట్రోల్ అంటే ఏమిటి?
E20 అంటే పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్, 80 శాతం సాధారణ పెట్రోల్ కలిపిన ఇంధనం. దిగుమతి అయ్యే ముడి చమురు వినియోగాన్ని తగ్గించడం, రైతులకు ఆదాయం పెంచడం మరియు కాలుష్యాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం.
E20 Petrol Facts కేంద్రం చెబుతున్న కీలక విషయాలు
1. ఎథనాల్ తయారీకి 10 వేల లీటర్ల నీరు అవసరమా?
కాదు. ఒక లీటర్ ఎథనాల్ తయారీకి సాధారణంగా 3 నుంచి 5 లీటర్ల ప్రాసెస్ చేసిన నీరు మాత్రమే ఉపయోగిస్తారని కేంద్రం తెలిపింది. చాలా ప్లాంట్లు నీటిని తిరిగి వినియోగించే Zero Liquid Discharge విధానాన్ని అనుసరిస్తున్నాయని పేర్కొంది.
2.E20 పెట్రోల్ ఇంజిన్‌ను పాడుచేస్తుందా?
అలాంటి ఆధారాలు లేవు. భారత ఆటోమొబైల్ పరిశోధనా సంస్థ (ARAI) నిర్వహించిన పరీక్షల్లో E20 వల్ల ఇంజిన్ పనితీరుపై గణనీయమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని తెలిపింది.
3.మైలేజ్ తగ్గిపోతుందా?
కొన్ని వాహనాల్లో చాలా స్వల్ప మార్పు మాత్రమే ఉండొచ్చని, అయితే E20కు అనుగుణంగా రూపొందించిన వాహనాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
4.వాహన వారంటీ, ఇన్సూరెన్స్ రద్దవుతుందా?
కాదు. E20కు అనుకూలంగా తయారైన వాహనాలకు కంపెనీ వారంటీ, ఇన్సూరెన్స్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
5.E20లో చక్కెర ఉండటంతో చీమలు, తేనెటీగలు వస్తాయా?
ఇది కూడా అపోహే. ఇంధనంగా ఉపయోగించే ఎథనాల్‌లో చక్కెర ఉండదని, ప్రత్యేక రసాయనాల కారణంగా పురుగులు ఆకర్షితమయ్యే అవకాశం లేదని తెలిపింది.
6.E20 వల్ల ట్యాంక్‌లోకి నీరు చేరుతుందా?
ఆధునిక వాహనాలు, పెట్రోల్ బంక్‌లలో ఉన్న భద్రతా వ్యవస్థల వల్ల అలాంటి సమస్య ఉండదని కేంద్రం పేర్కొంది.
7.చెరకు రసాన్ని నేరుగా పెట్రోల్‌లో కలుపుతున్నారా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు తప్పుడు ప్రచారం అని కేంద్రం స్పష్టం చేసింది. ఇంధన ఎథనాల్ పరిశ్రమలలో ప్రత్యేక ప్రమాణాలతో తయారవుతుందని తెలిపింది.
8.పర్యావరణానికి హానికరమా?
ఎథనాల్ ప్లాంట్లు పర్యావరణ నిబంధనలకు లోబడి పనిచేస్తాయని, అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే కార్యకలాపాలు నిర్వహిస్తాయని కేంద్రం తెలిపింది.
E20 Petrol Facts వల్ల దేశానికి కలిగిన ప్రయోజనాలు
- ముడి చమురు దిగుమతులు తగ్గడం
- విదేశీ మారక ద్రవ్య ఆదా
- రైతులకు భారీ స్థాయిలో చెల్లింపులు
- కార్బన్ ఉద్గారాల తగ్గింపు
- స్వదేశీ ఇంధన ఉత్పత్తికి ప్రోత్సాహం
E20 Petrol Facts
కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో 20 శాతం ఎథనాల్ మిశ్రమ లక్ష్యం 2025 చివర్లోనే సాధించబడింది.
E20 పెట్రోల్‌పై సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంజిన్ డ్యామేజ్, వారంటీ రద్దు, అధిక నీటి వినియోగం వంటి అంశాలపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది. వాహనదారులు సోషల్ మీడియా పోస్టులను నమ్మే ముందు అధికారిక సమాచారం పరిశీలించడం మంచిది.
Read More: Read Today’s E-paper News in Telugu
