Advertisement

Vemulawada: శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం

పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం కన్నుల పండుగ జరిగింది వేములవాడ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా చాలా బాగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం రోజున 11:50 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ (భక్తోత్సవము) క్రతువును ఆలయ అర్చకుల ఈశ్వరి గారి సురేష్ మరియు చంద్రగిరి శరత్ గోపన్న గారి చందు గణేష్ మరియు రాజు, శ్రీధర్ ల బృందం చేతుల మీదుగా నిర్వహించబడిన రాచకొండ భాను మరియు అనురాధ దంపతులు కన్యదాతలుగా ఇక్కడ విహరించడం జరిగింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement


వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జోగినీలు హిజ్రాలు రాజన్నను మనువాడడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో కళ్యాణానికి వచ్చిన భక్తులందరూ హిజ్రాలు జోగినీలు పెళ్లి వేడుకలను తిలకించేందుకు ఆసక్తి చూపారు.
పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్. వేడుకల్లో భాగంగా ప్రతి ఏడాది లాగా ఏడాది సైతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మున్సిపల్ కార్యాలయం తరఫున కమిషనర్ అన్వేష్, అధికారులు , సిబ్బందితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు స్థానిక బిజెపి నాయకులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Vemulawada: కన్నుల పండుగ స్వామివారి కళ్యాణం: వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం వేములవాడ రాజన్న గుడిలో జరిగిందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆదివారం మీడియాకు తెలిపారు. స్వామివారి కళ్యాణ తంతు తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడం వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వామివారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు

రాజన్న ఆలయంలో రాములోరి కళ్యాణం.

తెలంగాణలోని అతిపెద్ద హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారాభిషేకం వేద మంత్రలతో నిర్వహించారు అనంతరం ఆలయంలోని శ్రీ సీతారామచంద్రస్వామి మూల మూర్తికి కళ్యాణం నిర్వహించిన అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి వారల ఉత్సవమూర్తులను ఆలయ వెనుక భాగంలోని చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై కళ్యాణాన్ని అర్చకులు వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు కన్యాదాతలుగా రాచకొండ భాను కాంతి దంపతులు వ్యవహరించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో వినోద్ లు సమర్పించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో శివపార్వతులు జోగినిలు హాజరై రాములవారి కళ్యాణాన్ని తిలకించించారు.

Read more:

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.