Telanganapatrika (July 19) : Vaddera Community ST Reservation 2025 – వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని, ఐక్యంగా ఉద్యమించాలని వడ్డెర సంఘం నేతల డిమాండ్.
వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి – వడ్డెర సంఘం డిమాండ్

Vaddera Community ST Reservation 2025.
వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పీట్ల శ్రీదర్ ను గ్రేటర్ హైదరాబాద్ వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల స్వామి గురువారం మర్యాద పూర్వకంగా కలిసారు. జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన శ్రీధర్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దండుగుల స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని వడ్డెర కులస్తులను ఎస్టీల జాబితాలో చేర్చాలని కోరారు. ఇందుకోసం వడ్డెర కులస్తులంతా ఏకమై జాతీయస్థాయిలో పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర్లను గుర్తించి అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వడ్డెర్లు ఐక్యమత్యంతో ఉద్యమించి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు.
Read More: Fish Venkat : ఫిష్ వెంకట్ మృ*తికి కారణం ఇదే..!

One Comment on “Vaddera Community ST Reservation 2025 – వడ్డెర్లకు ఎస్టీ హక్కులు కావాలి”