Telanganapatrika (May 31): Gangadhara karimnagar. గంగాధర మండలం మధుర నగర్ లో శనివారం రోజున ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సిసి రోడ్లను కేంద్ర మంత్రి బండి సంజయ్, చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం లో గంగాధర మండలానికి ఎన్ఆర్ఈజిఎస్ కింద రెండు కోట్ల 63 లక్షల నిధులు మంజూరు చేశామని వాటితో పలు అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా కేంద్రం నుండి నిధులు తెచ్చి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేస్తామని అలాగే పార్టీలకు అతీతంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ …..
కేంద్రం నుండి వచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మరియు ఎమ్మెల్యే కోటా కింద వచ్చిన నిధులు దాదాపు 5కోట్లకు పైగా గంగాధర మండలానికి మంజులు చేశామని ఈ నిధులతో ప్రతి గ్రామంలో సిసి రోడ్లను డ్రైనేజీలను నిర్మిస్తామని తెలిపారు. గత పది సంవత్సరాలుగా నియోజకవర్గం కుట్టు పడిందని గతంలో బండి సంజయ్ తో సమన్వయం లేక దీని నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా నిధులతో నియోజకవర్గాన్ని రానున్న మూడు సంవత్సరాల్లో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని తెలిపారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!