TELANGANA PATRIKA (MAY 15) , Telangana Police Promotions 2025 ప్రకారం, తెలంగాణలో ఏఆర్ విభాగానికి చెందిన ఏడుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతులు లభించాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ, “పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రజలకిచ్చే సేవకు న్యాయం చేయాలి,” అని హితవు చెప్పారు.

Telangana Police Promotions 2025 పదోన్నతి పొందినవారు వీరే
గురువారం స్థానిక పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, ఏడుగురు పోలీసు సిబ్బందికి పదోన్నతులు ప్రకటించడమే కాకుండా, వారి భుజాలపై హెడ్ కానిస్టేబుల్ చిహ్నాలు అలంకరించి అభినందనలు తెలిపారు.
పదోన్నతి పొందిన వారు:
- ఎన్ కిషన్ రావు
- ఎం అశోక్
- జే దుదిరామ్
- ఆర్ గోవింద్
- ఎల్ దినేష్
- ఎన్ అరవింద్
- ఆర్ రామారావు
నిర్మల్, జగిత్యాల జిల్లాలకు బదిలీలు
వీరందరినీ నిర్మల్ మరియు జగిత్యాల జిల్లాలలో ఖాళీలను బట్టి బదిలీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, సీసీ కొండరాజు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
Also Read : నేరేడిగొండ పోలీస్ స్టేషన్లో పిల్లల కోసం ప్రత్యేక పార్క్ ప్రారంభం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
