
TELANGANA PATRIKA(JUN 2) , కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని కమీషనరేట్ కేంద్రంలోని క్వార్టర్స్ గార్డ్స్ వద్ద ఎగురవేశారు. అలాగే, కమీషనరేట్ పరిపాలనా కార్యాలయం (సిపిఒ) వద్ద ఏసిపి (సీసీఆర్బి) జి. విజయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
పతాకావిష్కరణ అనంతరం గౌరవ వందనాలు స్వీకరించి, కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులు, మినిస్ట్రీరియల్ విభాగం అధికారులు మరియు సిబ్బందికి స్వీట్లను పంపిణీ చేశారు.
ఈ వేడుక పోలీస్ కమిషనరేట్ సిబ్బంది సమక్షంలో సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగింది.

Read More: Read Today’s E-paper News in Telugu
