Advertisement

ఎస్పీ అఖిల్ మహాజన్: జిల్లాలో గంజాయి గుట్టురట్టు – పోలీసుల ఉక్కుపాదం!

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

TELANGANA PATRIKA(MAY23) , ఎస్పీ అఖిల్ మహాజన్: ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటిదాకా 50 గంజాయి కేసులు నమోదు కాగా అందులో దాదాపు 26 కిలోల గంజాయి, 230 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

Advertisement
ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల పై యుద్ధం ప్రారంభం

మాదకద్రవ్యాల కేసులలో జిల్లాలో ఇప్పటివరకు 90 మంది అరెస్ట్…

మాదక ద్రవ్యాలను ఉక్కు పాదంతో అని చేయ్యాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు మాదకద్రవ్యాలను అరికట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే శుక్రవారం రోజు భీంపూర్ మండలం తాంసి (కే) గ్రామం లో మంచి కంటి అశోక్, ఓంకార్ల వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారని వెళ్లగా 30 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకొని వారిద్దరిపై భీంపురం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా గంజాయి ని అరికట్టడానికి జిల్లా పోలీసు సిబ్బంది షీ టీం సిబ్బంది ప్రత్యేకంగా గ్రామ గ్రామీణ పోలీసు మీకోసం కార్యక్రమాల నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తుంది.

ప్రజలు మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. శుక్రవారం రోజు వరకు జిల్లాలో దాదాపు 50 గంజాయి కేసులు నమోదు కాగా అందులో 107 మంది పై కేసులు కాగా ఇప్పటివరకు 90 మంది అరెస్టు అయ్యారని వారి వద్ద నుండి దాదాపు 26 కిలోల ఎండు గంజాయి, 230 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు . గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేకంగా కళాశాలలో విద్యా ప్రాంగణాలలో విద్యార్థులు, పోలీసులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల తో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గంజాయిని సేవించడం, పండించడం, వర్తకం చేయడం, వ్యాపారం చేయడం లాంటివి నిషేధంగా వాటిని నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతూ జిల్లాలో గంజాయిని రూపమాపడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో గంజాయిని సేవించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా గంజాయి కిట్లను ఉపయోగిస్తూ పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు ఎలాంటివి అందకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ జిల్లా కలెక్టర్ కి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ఎలాంటి సమాచారాన్ని మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో అందించబడిన వాట్సప్ ద్వారా 8712659973 నెంబర్ కి అందించవచ్చు, ఈ నెంబర్ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంటుంది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి తెలిపారు.

Also Read : Akhil Mahajan ips ప్రభుత్వ భూమిపై కన్నేసిన కబ్జాదారుడి ఆట కట్టిన అధికారులు..!

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.