Advertisement

Rythu Runa Mafi: రైతుల రుణమాఫీ లో కొత్త తరహా మోసం – రైతు వేషధారణలో ఇచ్చోడా సీఐ బి రాజు

Telanganapatrika (June 5): Rythu Runa Mafi: రైతుల రుణమాఫీ లో కొత్త తరహా మోసం – రైతు వేషధారణలో ఇచ్చోడా సీఐ బి రాజు5, బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న పంట రుణాన్ని దళారులే కట్టి, తిరిగి కొత్తగా దానికన్నా పెంచిన రుణాన్ని రైతులకు బ్యాంకు ద్వారా ఇప్పించి, వారి వద్ద 5-10 వేలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న దళారులు. వారి వద్ద నుండి పలు పత్రాలు స్వాధీనం. బుధవారం రైతుల వేషధారణలో ఉన్న పోలీసులను మోసం చేస్తూ పట్టుబడ్డ దళారులు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
rythu runa mafi fraud cib raju farmer disguise

ప్రతిరోజు బ్యాంకుల వద్ద రైతులను దగా చేస్తున్న దళారు కేటుగాళ్లు…..

Advertisement

Rythu Runa Mafi వివరాల ప్రకారం:-

ప్రతి సంవత్సరం రైతుకు బ్యాంకు ద్వారా రుణం లభిస్తుందని, ఆ రుణానికి ఏడు శాతం వడ్డీ ఉంటుందని, ఒకవేళ సంవత్సరంలోపు రుణాన్ని తీరిస్తే మూడు శాతం బోనస్ తిరిగి వస్తుందని,ఆ రుణాన్ని కట్టిన తర్వాత తదుపరి రుణం 20 నుండి 30 శాతం వరకు పెంచి బ్యాంకు ద్వారా రైతులు తిరిగి మళ్లీ రుణాన్ని సంపాదించవచ్చని, ప్రభుత్వం ఇలాంటి సౌలభ్యం రైతులకు అందించిందని ప్రజలందరికీ తెలుసు. బ్యాంకుల ద్వారా ఉన్న ఈ లొసుగును వాడుకుంటున్న మోసగాళ్లు, కేటుగాళ్లు జిల్లా నందు అమాయక రైతుల వద్ద ప్రతి సంవత్సరం రైతులకు తీసుకున్న రుణాలను వారే వడ్డీతో సహా కట్టేసి, తిరిగి రైతుల కు అధిక రుణాన్ని తీసుకున్న దానికన్నా అధికంగా వచ్చేలా చేసి, వచ్చిన తేడాలో రైతుల వద్ద నుండి దాదాపు ఒక రైతు నుండి 5000 నుండి 10000 వరకు వసూలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్న దళారులు. ఈ తరహా మోసాన్ని గ్రహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బుధవారం జిల్లా వ్యాప్తంగా 9 మండలాలలో జిల్లా పోలీసలే రైతులుగా వేషధారణ మార్చి 16 బృందాలను ఏర్పాటు చేసి బ్యాంకులకు తరలించగా, రైతులను మోసం చేయాలనే నేరస్వభావం కలిగిన దళారులు పోలీసులతో బేరసారాలు చేయడం, రైతు రుణమాఫీ తామే కట్టి ఎక్కువ రుణాన్ని కేటాయించి వచ్చిన దానిలో తమకు వాటా ఇయ్యాలని బేరసారాలు ప్రారంభించారు, ఇలా జిల్లా లోని వివిధ బ్యాంకుల వద్ద రైతులను మోసం చేస్తున్న 34 మంది దళారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఏర్పాటు చేసిన బృందాలలో జిల్లా పోలీసులు స్వయంగా రైతుల వేషాలలో ఉండటం గమనార్థం. రైతులను మోసం చేస్తే సహించేది లేదని, ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను దుర్వినియోగం చేస్తూ ప్రతి సంవత్సరం రైతుల వద్ద నుండి డబ్బులను దండుకుంటున్న దళారుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని దళారులు, మధ్యవర్తులను రైతులకు దూరంగా ఉండే విధంగా సూచనలు అందించాలని తెలిపారు. జిల్లాలోని ఉట్నూర్, నార్నూర్, నేరడిగొండ, ఇచ్చోడా, బేల, తలమడుగు, బీంపూర్, మావల, ఇంద్రవెల్లి ప్రాంతాలలో జిల్లా పోలీసులు స్వయంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 34 మంది నిందితులను పట్టుకోవడం జరిగిందని, వారందరిపై ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో సెక్షన్ 318 ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!2

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →