Rtc Bus Bike Incident , జగిత్యాల పట్టణంలో శుక్రవారం ఉదయం విషా**ద ఘటన చోటు చేసుకుంది. టీఆర్ నగర్‌కు చెందిన కొడిత్యాల కృష్ణమూర్తి అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా, జగిత్యాల బస్టాండ్ అవుట్ గేట్ వద్ద యూ-టర్న్ తీసుకునే ప్రయత్నంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు నంబర్: ( TG 03 Z 0030) బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ అతను ప్రా**ణాలు కోల్పోయాడు.

Rtc Bus Bike Incident జగిత్యాల శాసనసభ్యుల పరామర్శ
వార్త తెలుసుకున్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మృ**తుడి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ కౌన్సిలర్ చాంద్ పాషా సహా పలువురు స్థానిక నేతలు ఉన్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
- ప్రస్తుతం పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? లేక అనుకోని ప్రమాదమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ప్రజలకు విజ్ఞప్తి:
బస్సులు మరియు ఇతర వాహనాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. యూ-టర్న్ తీసుకునేటప్పుడు ముందు వెనుక వాహనాలపై జాగ్రత్తగా పరిశీలించి కదలాలి. చిన్న ప్రమాదం , పెద్ద నష్టం కలిగించవచ్చు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Rtc Bus Bike Incident: జగిత్యాల బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ఢీ”