
TELANGANA PATRIKA(JUN 4) , Residential Schools Telangana , జూన్ 10 తర్వాత విద్యార్థులు పాఠశాలలకు హాజరవ్వనున్నారు కాబట్టి, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ (KGBV)లు విద్యార్థుల రాకకు పూర్తిగా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.
బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హాస్టల్స్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి గదిలో ఫాగ్గింగ్ కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు, అధికారులకు సూచించారు.
Residential Schools Telangana శానిటేషన్, భద్రతా చర్యలు కీలకం
హాస్టల్ పరిసరాల్లో పిచ్చిమొక్కలు పూర్తిగా తొలగించాలి. పాములు, తేలు వంటి విషసర్పాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బౌండరీ వాల్ వరకూ శుభ్రపరిచే పనులు జరగాలి. సెప్టిక్ ట్యాంకులు, సంప్ ట్యాంక్లను శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.
నీటి నాణ్యత, హాస్టల్ వసతులపై దృష్టి
విద్యార్థుల కోసం నాణ్యమైన త్రాగునీరు అందించేలా RO ప్లాంట్స్, ఫిల్టర్లు లేదా మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి నాణ్యతను పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ AEలచే నీటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
చివరగా, విద్యార్థులు చేరేలోపు అవసరమైన వసతులన్నీ సిద్ధంగా ఉండేందుకు ప్రతి అంశానికి చెక్లిస్ట్ రూపొందించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో DEO మాధవి, BC అభివృద్ధి అధికారి రంగారెడ్డి, SC అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
