Telanganapatrika (జూలై 19) : Rachakonda Police News, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి డిసిపి అక్షాంష్ యాదవ్ మరియు కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు శాంతి భద్రతల దృశ్యంతో నాకాబంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తనిఖీలు జనగామ జిల్లాకు చెందిన గంగాపురం గ్రామ శివారులో జరిగాయి.

Rachakonda Police News 2025 july.
ఈ తనిఖీలను ఎస్సై జి. సైదులు నేతృత్వంలో చేపట్టి, మారణాయుధాలు, నిషేధిత వస్తువుల తరలింపును అడ్డుకునే ఉద్దేశ్యంతో వాహనాలను పూర్తిగా పరిశీలించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ఈ నాకాబందిలో ఏఎస్సై ప్రకాష్, హెడ్ కానిస్టేబుల్ గురవయ్య మరియు ఇతర ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ తరహా తనిఖీలు భవిష్యత్తులోను కొనసాగుతాయని పోలీసు శాఖ తెలిపింది. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Read More: Vaddera Community ST Reservation 2025 – వడ్డెర్లకు ఎస్టీ హక్కులు కావాలి