Sanjay kumar old city hyderabad statement : పాతబస్తీకి తిరిగి రావాలి బండి సంజయ్ పిలుపు.

TelanganaPatrika (July 20 ): sanjay kumar old city hyderabad statement , పాతబస్తీ ప్రాంతానికి భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన హిందువులు మళ్లీ తమ ఇంట్లకు తిరిగిరావాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో బోనాలు సందర్భంగా పాతబస్తీలోని లాల్‌దర్వాజ గుళ్లో అమ్మవారిని దర్శించుకున్న ఆయన, అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడుతూ… “ఒకప్పుడు ఉగ్రవాద బాంబులు, జిహాదీ గుంపుల భయంతో పాతబస్తీని విడిచినవారు మళ్లీ తమ స్వగృహాలకు తిరిగిరావాలి” అన్నారు.

Advertisement

sanjay kumar old city hyderabad statement
bandi Sanjay Kumar – Credit: X/@bandisanjay_bjp

Sanjay kumar old city hyderabad statement.

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పాతబస్తీలోని ప్రతి దేవాలయానికి నిధులు కేటాయిస్తామని, ఇకపై ఆలయ కమిటీలకు ప్రభుత్వానికి నిధుల కోసం వేడుకోవాల్సిన అవసరం ఉండదన్నారు.

Advertisement

ఇతర పార్టీల నాయకులు ఆదివారం దేవాలయాలకు వెళ్లి ప్రోటోకాల్ విషయంలో గొడవ పడుతుంటే, బీజేపీ మాత్రం హిందూ సంప్రదాయాన్ని, ధర్మాన్ని కాపాడేందుకు ముందుంటుందని ఆరోపించారు.

పాతబస్తీ నివాసితులందరూ రెగ్యులర్‌గా ఇళ్ల పన్ను, విద్యుత్తు బిల్లులు, నీటి బిల్లులు చెల్లిస్తుంటే… కొన్ని వర్గాలు పన్నులు చెల్లించకుండా సర్కారు ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Advertisement

“ఈ బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని మనం సనాతన ధర్మాన్ని కాపాడాలన్న సంకల్పం తీసుకోవాలి. ‘సర్వే జనాః సుఖినోభవంతు’ అనేది మన హిందూ ధర్మ పరంపర,” అని పేర్కొన్నారు.

Read More: Rahul Sipligunj 1 crore award : 1 కోటి బహుమతి – Bonalu సందర్భంగా CM Revanth Reddy గౌరవం

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 2 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

One Comment on “Sanjay kumar old city hyderabad statement : పాతబస్తీకి తిరిగి రావాలి బండి సంజయ్ పిలుపు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *