Prabhas Spirit Movie Release Date 2027: భారతీయ సినీ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ విషయాన్ని శుక్రవారం చిత్ర బృందం అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, అలాగే నిర్మాణ సంస్థలైన టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విడుదల తేదీని వెల్లడించారు.
భూషణ్ కుమార్ (టీ-సిరీస్), ప్రణయ్ రెడ్డి వంగా (భద్రకాళి పిక్చర్స్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తొలిసారి అత్యంత శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా ‘యానిమల్’ ఫేమ్ తృప్తి దిమ్రీ నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ కాస్టింగ్‌తో పాటు సందీప్ రెడ్డి వంగా స్టైల్ నెరేషన్ కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రేక్షకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెలుగు, హిందీ సహా మొత్తం 9 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన విజయాలతో దర్శకుడు వంగా తన సత్తా చాటిన నేపథ్యంలో, ‘స్పిరిట్’పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
