Telanganapatrika (జూలై 20 ): playing cards raid 2025,పేకాట స్థావరంపై దాడులు నిర్వహించిన పోలీసులు నగదు, బైకులు ,సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Playing Cards Raid 2025.
ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాలు మేరకు అన్నపురెడ్డిపల్లి మండల పరిధి కంపగూడెం శివారులో శనివారం సాయంత్రం 8 గంటల సమయంలో కొందరు వ్యక్తులు నగదుతో పేకాట ఆడుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారని వివరించారు.
ఈ దాడిలో నలుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 20,000 నగదు, 4 సెల్‌ఫోన్లను ,ఒక బైక్ , పేక ముక్కలను స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లుv వెల్లడించారు. గేమింగ్ ఆక్ట్ ప్రకారం నలుగురు వ్యక్తులపై కేసు నమోదుచేసినట్లు ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎస్సై వివరించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More: Bonalu Holiday Telangana : బోనాల పండుగ రేపు సెలవు.!
