Advertisement

Nizamabad 2025: రైతు మహోత్సవం నిజామాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభం!

తెలంగాణ పత్రిక (APR.22) , Nizamabad 2025: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ నందు రైతు మహామేళ. సోన్ అగ్రికల్చర్ ఆఫీసర్ వినోద్ కుమార్

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

సోన్ మండల రైతన్నలకు శుభవార్త 23వ తారీకు బుధవారం రోజున నిజామాబాదులోని(Nizamabad 2025) గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్స్ నందు మహా రైతు మేళ నిర్వహిస్తున్నట్లు సోన్ మండల వ్యవసాయ అధికారి గొల్లపల్లి వినోద్ కుమార్ తెలియజేశారు.

Advertisement

ఇది కేవలం సోన్ మండల రైతులకు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు ఇట్టి అవకాశాన్ని మండలంలోని రైతన్నలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

రైతు మహోత్సవం కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన, పాశుసంవర్ధక, మత్స్యశాఖ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు,అవార్డు గ్రహీతలు పాల్గొంటారని అనంతరం అభ్యుదయ రైతులతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. వ్యవసాయ అనుబంధ శాఖల మరియు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన 150 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇట్టి అవకాశాన్ని సోన్ మండల రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఆధార్ మరియు ఫోన్ నెంబర్ ఇచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు. 23 వ తారీఖున ఉదయం 9 గంటలకు సోన్ మండల కేంద్రం నుండి బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొని అక్కడ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు ఇచ్చే సలహాలను, సూచనలను పాటించి నూతన వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని అధిక దిగుబడులను పొందాలని ఆయన కోరారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →