TelanganaPatrika (jun 8):MLA medipally satyam , మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల అమలులో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఆయన స్వయంగా పర్యటించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ప్రతి హక్కుదారుడికి ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
MLA medipally satyam ముదిరాజ్ బోనాల కార్యక్రమం
అనంతరం ముదిరాజ్ కులస్తుల బోనాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుల ఉత్సాహాన్ని అభినందిస్తూ, బోనాల ఉత్సవం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకతగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
పాలకుల పట్ల ప్రజల్లో నమ్మకం
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తినిశ్రీనివాస్ మల్లేశ్వరి గౌడ్, దారం ఆదిరెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు. మండల స్థాయి నాయకులు మ్యక లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, కనకట్ల జలంధర్, జంగిలి హనుమంతు, మిలిటరీ శీను తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ నేతల భాగస్వామ్యం
ఇటు ముద్దం శ్రీనివాస్, కంచర్ల లక్ష్మణ చారి, కోరేపు వెంకటేష్, రామగిరి మురళి, మర్రి లక్ష్మణ్, చెలుమెల్ల భూమేష్, బండి రవి, బీవీ రమణ, కంటే అరుణ్, కటుకూరి ప్రసాద్ తదితర నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
