Telanganapatrika (July 19): Minister Ponnam Prabhakar , హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను శనివారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ మండల , మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ లో ఉన్న 25 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశామని,హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వెంట వెంటనే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Minister Ponnam Prabhakar అర్హులందరికీ పథక ప్రయోజనాలు చేరవస్తున్నాయి
పెళ్లి చేసుకున్న వెంటనే ఆధారాలతో సహా సంబంధిత అధికారి వద్ద అప్లై చేసుకోవాలని,అప్లై చేసుకున్న వెంటనే చెక్కులు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులకు ఆటంకం లేకుండా పేమెంట్ చేస్తున్నామని తెలిపారు.భవిషత్ లో కూడా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఆలస్యం కాకుండా వెంట వెంటనే చెక్కులు పంపిణీ చేస్తాం..
ఎక్కడ కూడా పెండింగ్ లో లేవని,చెక్కులు వచ్చిన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డిఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య,అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu