Telanganapatrika (July 16): MLC Addanki Dayakar , కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి విచ్చేసిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడతల ప్రణవ్ బాబు కి స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించడం జరిగింది.

MLC Addanki Dayakar పార్టీ కార్యాచరణపై నేతల సమావేశం
ఈ కార్యక్రమంలో జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి ,దొంత రమేష్, సుంకరి రమేష్ ,జిల్లెల్ల తిరుపతిరెడ్డి, సతీష్ రెడ్డి, మేకల తిరుపతి,నల్ల కొండల రెడ్డి , శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు .. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారు మీరందరూ ఐక్యతగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపిటిసిలను జెడ్పిటిసి లను ఎంపీపీలుగా జిల్లా పరిషత్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఐక్యతగా పనిచేయాలని తెలపడం జరిగింది.
Read More: Read Today’s E-paper News in Telugu