Kavitha new political party : ఏప్రిల్ 25న కవిత పార్టీ లాంచ్ తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు

Kavitha new political party: తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం మొదలైంది!!ఇప్పటివరకు వినిపించిన వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక భారీ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 25, ఉదయం 8 గంటలకు ఆమె తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించబోతున్నారు.

“ఇది పార్టీ కాదు… ప్రజల ఉద్యమం!”

శ్రీరామ నవమి సందర్భంగా కవిత సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. “ఇది కేవలం పార్టీ కాదు… మీ అందరి ఉద్యమం. తెలంగాణ భవిష్యత్తును మనమే నిర్మిద్దాం” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

ఎక్కడ జరుగుతుంది పార్టీ లాంచ్?

హైదరాబాద్ సమీపంలోని అడ్వయా కన్వెన్షన్, ORR ఎగ్జిట్ నెం.6, మునీరాబాద్, మెద్చల్ వద్ద ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.

Advertisement

Kavitha new political party కోర్టు గ్రీన్ సిగ్నల్

మార్చి 19న ఢిల్లీ హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది.ఎన్నికల సంఘం (ECI) కవిత పెట్టిన పార్టీ రిజిస్ట్రేషన్ అభ్యర్థనను త్వరగా పరిశీలించాలని సూచించింది. ఇది ఆమె కొత్త పార్టీకి పెద్ద బూస్ట్‌గా మారింది.

BRSతో బ్రేక్… కొత్త రాజకీయ ప్రయాణం

కవిత గతంలో BRS పార్టీలో కీలక నాయకురాలు. కానీ 2025లో జరిగిన వివాదాల తరువాత పార్టీ నుండి సస్పెన్షన్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కొత్త పార్టీ ప్రకటింపు ఇవన్నీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. పేదల కోసం పోరాటం కవిత ఫోకస్ కవిత ప్రస్తుతం ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్నారు.

ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన

Advertisement

700కి పైగా గుడిసెల తొలగింపు పేదల ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం కవిత ధరణా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.

ధరణా ప్రభావం ప్రభుత్వం చర్యలు

ఆమె పోరాటం ఫలితంగా:

311 మందికి ఇల్లు స్థల పత్రాలు101 మందికి ఇండిరమ్మ ఇల్లు మంజూరు ఇది కవిత రాజకీయంగా బలపడుతున్న సంకేతంగా భావిస్తున్నారు.

పెద్ద బిల్డర్లపై కూడా ప్రశ్నలు

నర్సింగిలో పెద్ద నిర్మాణాలపై కూడా కవిత గళం వినిపించారు. “పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు… కానీ పెద్ద బిల్డర్లను ఎందుకు వదిలేస్తున్నారు?” అంటూ ప్రభుత్వం పై ప్రశ్నలు సంధించారు.

Kavitha new political party తెలంగాణలో కొత్త రాజకీయ అల

ఏప్రిల్ 25తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది!కవిత పార్టీ ఎంత ప్రభావం చూపుతుంది? 2026 ఎన్నికల్లో ఇది గేమ్ ఛేంజర్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తుంది!

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →