
Telangana Pulse Polio Drive 2026: తెలంగాణలో చిన్న పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 22న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.

ఈ విషయాన్ని కుటుంబ ఆరోగ్య, సంక్షేమ శాఖ కమిషనర్ ఎం.డి. ముషరఫ్ అలీ గురువారం వెల్లడించారు.
Telangana Pulse Polio Drive 2026 ఏయే జిల్లాల్లో పోలియో చుక్కలు వేస్తారు?
నవంబర్ 22న కింది ఐదు జిల్లాల్లో ప్రత్యేక పోలియో కార్యక్రమం నిర్వహిస్తారు.
- హైదరాబాద్
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- మేడ్చల్-మల్కాజిగిరి
- హనుమకొండ
ఈ జిల్లాల్లోని ఐదేళ్లలోపు పిల్లలకు ఎంపిక చేసిన పోలియో కేంద్రాల్లో రెండు చుక్కల బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (bOPV) వేస్తారు.
Telangana Pulse Polio Drive 2026 ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు
నవంబర్ 22న పోలియో కేంద్రాలకు రాలేని పిల్లల కోసం ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నవంబర్ 23, 24 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ కార్యక్రమం నవంబర్ 25 వరకు కొనసాగుతుంది.
ఎంతమంది పిల్లలకు టీకాలు వేయాలని లక్ష్యం?
ఈ ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 18,01,698 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు కోరారు. పోలియో నుంచి పిల్లలను రక్షించడానికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu

