కరీంనగర్‌లో అంగన్‌వాడి టీచర్: కరీంనగర్ జిల్లా రంగాపూర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక అంగన్‌వాడి టీచర్‌పై పెద్ద ఆరోపణలు వెలుగుచూశాయి. పిల్లల పోషకాహారం కోసం ప్రభుత్వమే అందించే గుడ్లను వైన్స్ షాప్‌కు మళ్లించిన ఘటన బయటపడింది. జిల్లా అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపారు. దానిలో టీచర్ రాజమ్మపై ఆరోపణలు నిజమని తేలడంతో, ఆమెను ఉద్యోగం నుంచి తక్షణమే తొలగించారు.

కరీంనగర్‌లో అంగన్‌వాడి టీచర్ దందా పిల్లల ఆహారమే మళ్లింపు
ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన సూపర్వైజర్‌పై కూడా చర్యలు తీసుకోగా, CDPO (చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్)కి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
కలెక్టర్ పమేలా సత్పతి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారుల మాటల్లో, “పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారాన్ని ఎవరు వేరే చోటుకు మళ్లించినా, కఠిన చర్య తప్పదు”.
ఈ ఘటనతో గ్రామస్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం కోసం ఇచ్చే ఆహారాన్ని దుర్వినియోగం చేసినవారికి ఉదాహరణాత్మక శిక్ష ఇవ్వాలని వారు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
