iBomma Piracy Racket Hyderabad: హైదరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ నెట్‌వర్క్‌లలో ఒకదాన్ని ఛేదించారు. అక్రమ మూవీ వెబ్‌సైట్‌గా పేరుగాంచిన iBomma ను నడిపిన రవి అనే వ్యక్తి ఎంతో కాలంగా పెద్ద స్థాయిలో పైరసీ నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడింది.

21,000 సినిమాలు – ₹20 కోట్ల అక్రమ ఆదాయం
కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం, రవి మొత్తం 21,000 సినిమాలను డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేశాడు. హాలీవుడ్ క్లాసిక్ The Godfather (1972) నుండి తాజా తెలుగు సినిమా OG వరకు వేలాది సినిమాలు అతని హార్డ్‌డిస్క్‌లో లభించాయి. పైరసీతో ₹20 కోట్లకు పైగా ఆదాయం సంపాదించిన రవికి చెందిన ₹3 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అంచనా ప్రకారం, రవి పైరసీ రాకెట్‌ను కొనసాగించడానికి:
- 65 మిరర్ వెబ్‌సైట్లు సెట్ చేశాడు
- 101 డొమైన్‌లు కొనుగోలు చేశాడు
బ్లాక్ అయ్యే ప్రతి డొమైన్‌కు వెంటనే కొత్త లింక్ క్రియేట్ చేశాడు వీటితో పాటు థియేటర్లలో రికార్డు చేసిన కెమెరా ప్రింట్లు, OTT రిలీజ్‌లను కూడా లీక్ చేసి, టెలిగ్రామ్ ఛానల్‌ల ద్వారా పంపిణీ చేసినట్లు గుర్తించారు.
సైబర్ సెక్యూరిటీ కోణంలో ఈ కేసు మరింత ప్రమాదకరమని సజ్జనార్ హెచ్చరించారు.
iBommaను ఉపయోగించే వారి డేటా డార్క్‌నెట్‌లోకి వెళ్లే ప్రమాదం ఉన్నందున యూజర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
పైరసీ నుండి బేటింగ్‌కు మలుపు
పోలీసులు వెల్లడించిన మరో కీలక అంశం రవి ఆపరేషన్లలో ఉన్న ఆన్‌లైన్ బేటింగ్ ప్రమోషన్.
iBomma ద్వారా వచ్చిన ట్రాఫిక్‌ను బేటింగ్ యాప్‌లకు మళ్లించాడు APK ఫైల్‌లు షేర్ చేసి యూజర్లను సైబర్ మోసాలకు గురిచేశాడు పోలీసులు ఇప్పటికే iBomma, Bappam వంటి సంబంధిత వెబ్‌సైట్లను తీసివేశారు.
అంతర్జాతీయ లింకులు – కేసు CBI, EDకు
పిరసీ నుండి వచ్చిన డబ్బు విదేశాలకు వెళ్లిన అనుమానంతో ఈ కేసును CBI మరియు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లకు పంపించనున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏకంగా 50 లక్షల యూజర్ల డేటా ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నట్లు వెల్లడైంది.
రవి సవాలు… ఇప్పుడు జైలు గదిలో
ఎప్పుడో “పోలీసులు నన్ను పట్టలేరు” అంటూ సవాళ్లు విసిరిన రవి, ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నాడు.
పోలీసులు అతన్ని మళ్లీ కస్టడీలోకి తీసుకుని నెట్‌వర్క్‌ను పూర్తిగా విచ్ఛిన్నం చేయాలని భావిస్తున్నారు.
iBomma Piracy Racket Hyderabad క్రియేటర్లకు పోలీసుల హెచ్చరిక
పోలీసులపై అవమానకరమైన మీమ్స్, పోస్టులు చేస్తున్న సోషల్ మీడియా క్రియేటర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu


Comments are closed.