Google Maps Offline: ప్రయాణంలో ఉన్నప్పుడు చాలాసార్లు మొబైల్ సిగ్నల్ ఉండదు. కొండ ప్రాంతాలు, అడవులు లేదా విదేశాల్లో ఇంటర్నెట్ పనిచేయకపోవచ్చు. అలాంటి సమయంలో Google Maps Offline Mode మీకు చాలా ఉపయోగపడుతుంది.

ముందుగానే మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే, ఇంటర్నెట్ లేకున్నా దారి తెలుసుకోవచ్చు.
Google Maps Offline ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
విధానం 1

- Google Maps యాప్‌ను ఓపెన్ చేయండి.
- కుడి పైభాగంలో ఉన్న Profile Photoపై ట్యాప్ చేయండి.
- Offline Maps ఎంపికను ఎంచుకోండి.
- Select Your Own Mapపై ట్యాప్ చేయండి.
- వెళ్లాల్సిన ప్రాంతాన్ని బాక్స్‌లో సెలెక్ట్ చేయండి.
- Download బటన్‌పై ట్యాప్ చేయండి.
కొన్ని నిమిషాల్లో మ్యాప్ మీ ఫోన్‌లో సేవ్ అవుతుంది. ఒక నగరం లేదా పట్టణం మ్యాప్ డౌన్‌లోడ్ చేయాలంటే
ఇది మరింత సులభం.
- Google Mapsలో మీరు వెళ్లాలనుకునే నగరం పేరు సెర్చ్ చేయండి.
- ఉదాహరణకు Hyderabad లేదా Visakhapatnam.
- ఇప్పుడు కుడి పైభాగంలో ఉన్న మూడు చుక్కలు (⋮)పై ట్యాప్ చేయండి.
- Download Offline Map ఎంపికను ఎంచుకోండి.
- అవసరమైతే మ్యాప్ పరిధిని సర్దుబాటు చేసి Download చేయండి.
Google Maps Offline వల్ల ఉపయోగాలు
- ఇంటర్నెట్ లేకున్నా దారి తెలుసుకోవచ్చు.
- విదేశాల్లో డేటా ఖర్చు తగ్గుతుంది.
- కొండలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపయోగపడుతుంది.
- ప్రయాణ సమయంలో నెట్ సమస్య ఉన్నా నావిగేషన్ కొనసాగుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- ఆఫ్‌లైన్‌లో Live Traffic సమాచారం కనిపించదు.
- ట్రాఫిక్ లేకపోతే ఎంత సమయం పడుతుందో దాని ఆధారంగా మాత్రమే ప్రయాణ సమయం చూపిస్తుంది.
- మ్యాప్ ఫైల్ ఫోన్‌లో కొంత స్టోరేజ్ తీసుకుంటుంది.
- Auto Update ఆన్ చేస్తే మ్యాప్స్ సుమారు ప్రతి రెండు వారాలకు ఒకసారి తాజా సమాచారంతో అప్డేట్ అవుతాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
