తెలంగాణ పత్రిక (APR.18) , GHMC పరిధి లో ని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ నీ తన కార్యాలయంలో కలిసి చిల్కానగర్ డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిందిగా కోరడం జరిగింది.

GHMC పరిధి లో ని చిల్కానగర్ డివిజన్లోని చిల్కానగర్ యాదగిరి రేషన్ షాప్ వీధిలో లో స్ట్రాం వాటర్ డ్రైన్స్ మరియు సిసి రోడ్ల కొరకు చిల్కానగర్ మరల మైసమ్మ ఆలయం,మర్రిచెట్టు బొడ్రాయి ప్రాంతంలో స్ట్రాం వాటర్ డ్రైన్ మరియు సిసి రోడ్ల కొరకు సాయిరాం నగర్ కాలనీలో, శ్రీనగర్ కాలనీ ధర్మపురి కాలనీ, రాఘవేందర్ నగర్ కాలనీలో స్ట్రాం వాటర్ డ్రైన్ మరియు సిసి రోడ్ల కొరకు బీరప్ప గడ్డ లక్ష్మీ నరసింహ టెంపుల్ ఆలయం ఎదురుగా, లైబ్రరీ ఎదురుగా, రామాలయం వీధిలో పలు స్ట్రాం వాటర్ డ్రైన్ ల కు మరియు సిసి రోడ్ల కువెంటనే నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం వెనకాల మున్సిపల్ మైదానంలో విషాతాత్ ఎన్క్లేవ్, హైకోర్టు కాలనీ ,అజ్మత్ నగర్, ఆదర్శనగర్ గ్రౌండ్లో, చిల్కానగర్ గుట్ట పైన, బీరప్ప గడ్డ ప్రాంతంలో ఓపెన్ జిమ్ లు ఏర్పాటుకు నిధులు కేటాయించాల్సిందిగా కోరడం జరిగింది.
GHMC పరిధి లో ని జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ పైన వివరించిన అభివృద్ధి పనులకు వీలైనంత త్వరలో నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
Read More: Read Today’s E-paper News in Telugu

Comments are closed.