
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (Hyderabad Zoo) సందర్శించాలనుకునే వారికి ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. Hyderabad Zoo Ticket Priceలను తెలంగాణ జూస్ అండ్ పార్క్స్ అథారిటీ (ZAPAT) సవరించింది. కొత్త టికెట్ ధరలు ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ నిర్ణయం జూలై 13న జరిగిన ZAPAT 15వ గవర్నింగ్ బాడీ సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశానికి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షత వహించారు.
ప్రవేశ టికెట్ ధరలు పెరిగాయి
కొత్త రేట్ల ప్రకారం భారతీయ సందర్శకుల కోసం:

- పెద్దలకు టికెట్ రూ.100 నుంచి రూ.120
- పిల్లలకు టికెట్ రూ.50 నుంచి రూ.60
గా పెరిగింది.
సఫారీ టికెట్ కొత్త ధరలు
జూ సఫారీకి వెళ్లే వారికి కూడా ఛార్జీలు పెరిగాయి.
- AC Safari : రూ.150 → రూ.165
- Non-AC Safari : రూ.100 → రూ.110
బ్యాటరీ వాహనం ఛార్జీలు
జూలో బ్యాటరీ ఆపరేటెడ్ వాహనంలో ప్రయాణించే వారికి:
- పెద్దలు : రూ.120 → రూ.135
- పిల్లలు : రూ.70 → రూ.75
టాయ్ ట్రైన్ ఛార్జీలు
జూలోని టాయ్ ట్రైన్ ప్రయాణానికి:
- పెద్దలు : రూ.80 → రూ.90
- పిల్లలు : రూ.40 → రూ.45
Hyderabad Zoo Ticket Price ఇతర ఆకర్షణల కొత్త ధరలు
ఇతర సేవల టికెట్ ధరలు కూడా సవరించారు.
- Fish Aquarium : రూ.20 → రూ.25
- Nocturnal Animal House
- పెద్దలు : రూ.25
- పిల్లలు : రూ.15
- Reptile House
- పెద్దలు : రూ.30 → రూ.35
- పిల్లలు : రూ.10 → రూ.15
కొత్త టికెట్ రేట్ల పట్టిక
| సేవ | పాత ధర | కొత్త ధర |
|---|---|---|
| Adult Entry | ₹100 | ₹120 |
| Child Entry | ₹50 | ₹60 |
| AC Safari | ₹150 | ₹165 |
| Non-AC Safari | ₹100 | ₹110 |
| Battery Vehicle (Adult) | ₹120 | ₹135 |
| Battery Vehicle (Child) | ₹70 | ₹75 |
| Toy Train (Adult) | ₹80 | ₹90 |
| Toy Train (Child) | ₹40 | ₹45 |
| Fish Aquarium | ₹20 | ₹25 |
| Reptile House (Adult) | ₹30 | ₹35 |
| Reptile House (Child) | ₹10 | ₹15 |
జూను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్న వారు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త ఛార్జీలను ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
