Fake Reporters : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ముగ్గురు నకిలీ విలేకరులు ఓ రైతును బెదిరించి నగదు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన ఇచ్చోడా సీఐ బండారి రాజు వారి మీద కఠినంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు.

Fake Reporters బాధిత రైతుపై మానసిక ఒత్తిడి
ఫిర్యాదుదారుడు టగరే కాసాన్ దాస్ అనే రైతు, తన కూతుర్ల పెళ్లిళ్ల నేపథ్యంలో జొన్న పంటను ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఆరబెట్టారు. ఇదే సమయంలో గాజుల దేవేందర్, షేక్ ఫస్యుద్దీన్, గాజుల శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులు విలేకరుల పేరుతో వచ్చి “నియమ విరుద్ధంగా పంట ఆరబెట్టారని” కేసులు పెడతామని బెదిరించారు.
డబ్బు డిమాండ్ – వసూలు
రైతును భయబెట్టి, రూ. 50,000 డిమాండ్ చేసిన నకిలీ విలేకరులు, రైతు అప్పు తెచ్చి రూ. 30,000 చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుల వద్ద రూ. 1,800 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తీసుకున్న చర్యలు
ఇచ్చోడ సీఐ బండారి రాజు మాట్లాడుతూ – “బలవంతంగా డబ్బులు వసూలు చేయడం నేరం. విలేకరుల పేషను చెడగొట్టే నకిలీ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని హెచ్చరించారు. నిందితులను గౌరవ న్యాయస్థానానికి హాజరుపర్చడంతో, వారిని రిమాండ్కు పంపించారు.
పోలీసుల హెచ్చరిక
ఇలాంటి మోసాలకు పాల్పడే ఎవరినైనా ఉపేక్షించబోమని జిల్లా పోలీసు శాఖ ప్రకటించింది. ఈ ఆపరేషన్లో నేరేడుగొండ ఎస్సై శ్రీకాంత్, ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu