Advertisement

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: జీవితాన్ని కాపాడుకోండి| మద్యం సేవించి డ్రైవింగ్ వద్దు.

TELANGANA PATRIKA (MAY 17) , కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన నాలుగు నెలల్లో జిల్లాలోని పోలీస్ స్టేషన్ లలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పట్టుబడిన 1785 మంది పై కేసులు నమోదు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్ట్ ద్వారా 646 మందికి, మొత్తం గా 9,33,331 రూపాయల జరిమానాలు విధించడం జరిగిందనీ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అన్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

శనివారం ఆయన మాట్లాడుతూ..,ఇంకా 1139 కేసులు పెండింగ్ లో ఉన్నవి. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే అట్టి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, తరచు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారస్సు చేయడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లిదండ్రులకు బాధ్యత వహించాలని హెచ్చరించారు. వాహనదారులు,రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు. తాగి వాహనాలు నడపవద్దని తద్వారా జరిగే ప్రమాదాలను కుటుంబ ఆర్థిక పరిస్థితులు చితికిపోయే అంశాలపై పోలీస్ శాఖ వారు కౌన్సిలింగ్‌ ద్వారా వివరించడం జరుగుతుంది. పట్టుబడిన వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది. మద్యం సేవించి మొదటిసారి పట్టుబడిన రెండవసారి పట్టుబడిన వారు సేవించిన మద్యం మోతాదులను బట్టి తప్పనిసరిగా శిక్షలు విధించబడతాయి. ట్రాఫిక్‌ నియంత్రణపైన,మద్యం తాగి వాహనాలు నడిపేవారిపైన కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారికి నిరంతరం కౌన్సిలింగ్‌లు ఇవ్వడం, సూచనలు చేయడం అంతే కాక పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మమేకమై పాటించాల్సిన నియమాలు వివరించడం వంటి కార్యక్రమాలు జిల్లా పోలీస్ శాఖ చేపట్టడం జరుగుతుందన్నారు.

Advertisement

Also Read : Adarsh Surabhi IAS: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా లో అభివృద్ధి సమీక్ష

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.