Advertisement

Pravinya IAS : వానలోనూ కళాశాల సందర్శనలో కలెక్టర్..!

Telanganapatrika (July 24): Pravinya IAS , సంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాల, వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య రెడ్డి విద్యార్థినులు, విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తును స్వయం సాధికారత వైపు తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యరెడ్డీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ వర్షాన్ని లెక్కచేయకుండా సంగారెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలనుకళాశాల ప్రాంగణం ను సందర్శించారు .

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

మహిళా విద్యార్థుల భద్రతపై కలెక్టర్ Pravinya IAS ఆరా..

కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని కూడా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. చదువుతో నే మహిళలకు భవిష్యత్తు, భద్రత అని అన్నారు . వసతి గృహంలో సౌకర్యాలు ఎలాఉన్నాయి అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు .విద్యార్థుల హాజరును పరిశీలించిన కలెక్టర్, తరగతుల నిర్వహణ పద్ధతులు, అధ్యాపకుల వివరాలు ఆరా తీశారు. వసతి గృహంలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహిళా కళాశాలలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. రాత్రివేళ భద్రతా సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని, సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో ఉన్నాయా అని ప్రశ్నించారు . సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల అన్నారు.విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వసతిగృహ అధికారులకు సూచించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరుణాబాయి , సంగారెడ్డి తాసిల్దార్ జయరామ్, వసతి గృహ సంక్షేమ అధికారి కల్పన ,సిబ్బంది పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *