Telanganapatrika (July 18): Bonalu Festival Karimnagar , స్థానిక రాంనగరంలోని వేదం ఉన్నత పాఠశాలలో తెలంగాణ బోనాల జాతర చాలా ఘనంగా జరిగింది. పాఠశాలలోని చిన్నారులు శివసత్తులు,పోతరాజులు వేషధారణలొ అలరించారు. వేదం పాఠశాల ఆవరణ పండగ వాతావరణంతో కళకళలాడింది.

Bonalu Festival Karimnagar వేదం పాఠశాలలో సాంప్రదాయ వేడుకలతో విద్యార్థుల సందడి..
తెలంగాణలో బోనం విశిష్టత గురించి విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగ ఆనవాయితీగా జరుగుతుందని తెలియజేశారు. చిన్నారులు బోనమెత్తుకొని పాఠశాల వీధులలో తిరుగుతూ డప్పు చప్పులతో డీజే సౌండ్స్ తో నృత్యాలు చేస్తూ చూపర్లను ఆకట్టుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
