
బాధిత కుటుంబాలకు బండి సంజయ్ భరోసా
TELANGANA PATRIKA(JUN 1) , హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గత జనవరి నెల 30న జాతీయ ఉపాధి హామీ పనులకు వెళ్లి మట్టి పెల్లలు మీద పడి మ**రణించిన ఇరువురు కుటుంబాల కుటుంబ సభ్యులు యోగేశ్వర్, శ్రీకాంత్ ఆదివారం రోజున కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలవగా ఉపాధి హామీ కూలీలు అన్నోజి మమత, కందరపు స్వరూప మర**ణం తీవ్ర విచారకరమని అధైర్యపడవద్దని ఇరువురు కుటుంబాలకు నేను అండగా ఉంటానని తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు మీ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావలసిన అన్ని విషయాలలో నేను అండగా ఉండి మీ కుటుంబాల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, గోవర్ధనగిరి మాజీ సర్పంచ్ పీచర రాములు, అక్కన్నపేట మండల పార్టీ అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి, హుస్నాబాద్ అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాలరావు, నునవత్ మోహన్ నాయక్ , పంగ సహదేవ రెడ్డి,పంగ శ్రీనివాస్ రెడ్డి లంబ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
