TelanganaPatrika(jun 9): Amrut 2 Water Scheme Telangana, అమృత్ 2 పథకాన్ని అమలు చేసి, చొప్పదండిలో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన నీరు, డ్రైనేజీ సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో రూ.36.3 కోట్ల విలువైన వాటర్ ఇంప్రూవ్ మెంట్ స్కీంకు నూతన శంకుస్థాపన జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Amrut 2 Water Scheme Telangana దేశవ్యాప్తంగా అమృత్ 2తో నీటి విప్లవం
బండి సంజయ్ మాట్లాడుతూ, “అమృత్ 2 పథకం కింద దేశవ్యాప్తంగా రూ.2.99 లక్షల కోట్లతో పట్టణాల్లో నీటి సరఫరా, డ్రైనేజీ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు. ఇందులో కేంద్రం వాటాగా రూ.76,760 కోట్లు మంజూరవ్వగా, మిగిలిన మొత్తం రాష్ట్రాలు మరియు మున్సిపాలిటీలు భాగస్వామ్యంగా అందించనున్నాయి.
చొప్పదండిలో అమృత్ 2 పని వివరాలు
- చొప్పదండిలో అమృత్ 2 పథకం కింద రూ.36.3 కోట్లతో
- 46.21 కిలోమీటర్ల పైప్‌లైన్
- 1500 KL లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులు
- 2800 ఇంటికీ నల్లా కనెక్షన్లు
అందించనున్నట్లు మంత్రి వివరించారు.
Amrut 2 Water Scheme Telangana ఈ నిధుల్లో
- కేంద్రం: రూ.17.89 కోట్లు
- రాష్ట్రం: రూ.15.11 కోట్లు
- మున్సిపాలిటీ: రూ.3.30 కోట్లు
- మొత్తం 2025 చివర నాటికి పనులను పూర్తిచేసి ప్రజలకు ఇంటింటికీ నీళ్లు అందించనున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం – ఇప్పుడు పురోగతి
గతంలో భూముల కేటాయింపు ఆలస్యం వల్ల ఈ పథకం ప్రారంభం కాలేకపోయిందని తెలిపారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విధంగా నీటి భద్రత కల్పించేందుకు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
చొప్పదండిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,
“కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో చొప్పదండిని రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం” అని అన్నారు. ప్రజలకు సరిపడా నీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu