Advertisement

Akhil Mahajan IPS: ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి నిర్మూలన దిశగా కఠిన చర్యలు – జిల్లా ఎస్పీ స్పష్టం

తెలంగాణ పత్రిక (MAY 01) , ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ Akhil Mahajan IPS మరియు పోలీసు విభాగం గంజాయి సాగు, సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా కోసం జిల్లాలో ADB-NAB (ఆదిలాబాద్ నార్కోటిక్ బ్యూరో) చురుకుగా పనిచేస్తోంది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ Akhil Mahajan IPS మాట్లాడుతూ ..

మార్చి 10 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 34 గంజాయి కేసులు నమోదు కాగా, 56 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో 12 కిలోల డ్రై గంజాయి, 181 మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ. 23.21 లక్షలు ఉంటుంది. గంజాయి సాగు చేస్తున్న 4 కేసుల్లో నిందితులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని సిఫార్సు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా యువతను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

“జిల్లాలో గంజాయి పూర్తిగా నిర్మూలించే వరకు చర్యలు ఆగవు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం” అని ఎస్పీ స్పష్టం చేశారు.

గంజాయి పై ఎలాంటి సమాచారం ఉన్నా 8712659973 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని జిల్లా పోలీసు అధికారులు హామీ ఇస్తున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →