Advertisement

Akhanda 2 Release Postponed : విడుదల వాయిదా డిసెంబర్ 5 రిలీజ్ షాకు..

Akhanda 2 Release Postponed: డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న Akhanda 2 చివరి క్షణంలోనే వాయిదా పడటం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. డిసెంబర్ 4 ప్రీమియర్లు కూడా ప్లాన్ చేసిన సినిమా ఇలా సడన్‌గా పోస్ట్‌పోన్ కావడం అభిమానుల్లో పెద్ద నిరాశను కలిగించింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఉదయం నుంచే నిజాం బుకింగ్స్, టికెట్టింగ్ అప్డేట్స్ క్లారిటీ లేకుండా ఉండటంతో సందేహాలు మొదలయ్యాయి. మధ్యాహ్నానికి సమస్యలు మరింత సీరియస్ అయ్యాయని తెలుసుకున్నారు. సాయంత్రానికి అయితే పరిస్థితి పూర్తిగా దారుణంగా మారింది.

Advertisement

Akhanda 2 Release Postponed ఎంతకీ సమస్య ఏంటి?

  • సినిమా ప్రొడక్షన్ హౌస్ 14 Reels Plus అధికారికంగా తెలియజేసిన ప్రకారం,
  • అనుకోని ఫైనాన్షియల్ ఇష్యూల కారణంగా సినిమా విడుదల చేయలేకపోయారు.
  • ఓవర్సీస్ KDMs కూడా క్లియర్ కాకపోవడంతో అక్కడ కూడా ప్రీమియర్లు రద్దయ్యాయి.
  • లేటెస్ట్‌గా నిర్ణయించిన పెయిడ్ ప్రీమియర్లు కూడా రద్దయిపోయాయి.

టాలీవుడ్‌లో చివరి నిమిషంలో ఇలాంటి ఆర్థిక సమస్యలు కొత్తవి కావు. కానీ ఈ రేంజ్ సినిమా… ఈ స్థాయి హైప్ కలిగిన సినిమా… రిలీజ్‌కు 24 గంటల ముందు వాయిదా పడటం చాలా అరుదు.

బాలయ్య ఫ్యాన్స్‌కి భారీ నిరాశ

బాలయ్యదగ్గర అఖండ పాత్రకే ఉన్న ప్రత్యేక క్రేజ్ వల్ల, సీక్వెల్ మీద అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడటం సహజంగానే వారిని నిరాశపరచింది.

తదుపరి రిలీజ్ తేదీ ఎప్పుడు?

ఇప్పటివరకు టీమ్ నుంచి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
అందరూ ఇప్పుడు టీమ్ ఇచ్చే అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →