
TELANGANA PATRIKA(JUN 2) , ప్రజల సమస్యల పరిష్కారానికి ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రతి సోమవారం “గ్రీవెన్స్ డే” ను పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహిస్తోంది. ఈసారి నిర్వహించిన కార్యక్రమంలో 15 ఫిర్యాదులు స్వీకరించబడినవి.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (ఐపీఎస్) స్వయంగా ప్రజల ఫిర్యాదులను విని, సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా వెంటనే ఆదేశాలు జారీ చేశారు. భూ సమస్యలు, నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల వివాదాలు, కేసుల పురోగతిపై ప్రజలు ఫిర్యాదు చేశారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..
“బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోలీసులు ప్రజల సేవలో అందుబాటులో ఉంటారు.” అని తెలిపారు.
ఈ సమావేశంలో సీసీ కొండ రాజు, ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
