TELANGANAPATRIKA (June 18): ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఇటీవల నియమితులైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బుధవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తీర్థ ప్రసాదాన్ని అందజేసి, పట్టు కండువా తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గౌరవించారు. కొత్త బాధ్యతలను చేపట్టిన మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ, జిల్లా అభివృద్ధి పరంగా సమన్వయంతో ముందుకెళ్లేందుకు హామీ ఇచ్చారు.
ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశకి సూచికగా భావిస్తున్నారు. మంత్రి తుమ్మలపై ఉన్న నమ్మకాన్ని పార్టీ స్పష్టంగా వెల్లడించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu


Comments are closed.