TELANGANA PATRIKA (MAY 6) , MLA CHOPPADANDI: ప్రతిభ ఉన్న విద్యార్థులు దేశానికే గర్వకారణం. అలాంటి విద్యార్థిని గడ్డం శతాక్షి — కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఈ యువతికి లండన్‌లోని గ్రీన్ విచ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం అవకాశమొచ్చింది.

MLA CHOPPADANDI ఎమ్మెల్యే సత్యం సాయంతో లండన్ ప్రయాణం:
శతాక్షి విదేశాల్లో చదవనున్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకురాగా, ఆమె ప్రతిభను గుర్తించి స్వయంగా అభినందించారు. అంతేకాదు, రూ.70,000 విలువైన విమాన టికెట్‌ను తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసి, విద్యార్థినికి అందజేశారు.
ఈ సందర్భంగా శతాక్షిని ప్రోత్సహిస్తూ — “నువ్వు ఖండాంతరాలకెళ్లి, గొప్ప చదువు పూర్తి చేసి, అంబేద్కర్ వంటి మహానుభావుల జాడల్లో నడవాలి. దేశానికి పేరు తీసుకురావాలి” అని ఎమ్మెల్యే ఆశీర్వచనాలు ఇచ్చారు.
తనకు అందించిన సహాయానికి శతాక్షి కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ గొప్ప ఉదారతకు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ప్రశంసిస్తున్నారు.
Also Read: Rajiv Yuva Vikasa: లోన్ కావాలా….. సిబిల్ స్కోర్ తప్పనిసరి…!
Comments are closed.