Rajiv Yuva Vikasa: లోన్ కావాలా….. సిబిల్ స్కోర్ తప్పనిసరి…!

TELANGANA PATRIKA(MAY 6) , Rajiv Yuva Vikasa Loan Eligibility: సిబిల్ స్కోర్ తప్పనిసరి..! తెలంగాణ రాష్ట్రంలో యువత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన ఈ పథకం ద్వారా రుణాలు అందించనున్నారు.

Rajiv Yuva Vikasa సబ్సిడీతో రుణాలు – ముఖ్యమైన సమాచారం:

ఈ పథకం కింద రూ.50,000 నుండి రూ.4,00,000 వరకు సబ్సిడీతో రుణాలు మంజూరు చేయనున్నారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు 5 లక్షల మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

సిబిల్ స్కోర్: లోన్‌కు అడ్డంకి

అయితే, దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో రుణాలు తీసుకుని చెల్లించనివారు, పర్సనల్, వ్యవసాయ, గృహ, వాహన రుణాల్లో డిఫాల్ట్ చేసిన వారు బ్యాంకుల నుండి తిరస్కరణకు గురవుతారని సమాచారం. కనీసం 700 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికే లోన్లు మంజూరయ్యే అవకాశముంది.

Advertisement

ఫీజు వసూలు – ప్రభుత్వ దృష్టికి

దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తనిఖీ కోసం బ్యాంకులు ఒక్కో దరఖాస్తుపై రూ.100 నుండి రూ.200 వరకు ఫీజును వసూలు చేయాలని భావిస్తున్నాయని వార్తల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం.

దరఖాస్తుల వివరాలు:

రాష్ట్రవ్యాప్తంగా పథకానికి 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో

  • బీసీ: 5,35,666
  • ఎస్సీ: 2,95,908
  • ఎస్టీ: 1,39,112
  • ఈబీసీ: 23,269
  • ముస్లిం మైనారిటీ: 1,07,681
  • క్రిస్టియన్ మైనారిటీ: 2,689

సుమారు 60 శాతం మంది దరఖాస్తుదారులకు మాత్రమే రుణాలు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: Atal Pension Yojana: అటల్ పెన్షన్ 2025 – భవిష్యత్తుకు బలం…!

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.