Karimnagar Anganwadi Recruitment 2026: కరీంనగర్ జిల్లాలో 60 అంగన్వాడీ పోస్టులు.. ఆగస్టు 15 వరకు దరఖాస్తు

Karimnagar Anganwadi Recruitment 2026 Notification

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పించింది. Karimnagar Anganwadi Recruitment నోటిఫికేషన్‌ను మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 60 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్వాడీ పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తుండగా, జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు ఆగస్టు 15, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Advertisement

పోస్టుల వివరాలు

ప్రాజెక్ట్పోస్టులు
గంగాధర20
హుజురాబాద్16
కరీంనగర్ (రూరల్)16
కరీంనగర్ (అర్బన్)8
మొత్తం60

karimnagar anganwadi recruitment 2026 విద్యార్హత

  • అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
  • సంబంధిత ప్రాంతానికి చెందిన స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

వయోపరిమితి

  • 18 నుంచి 35 సంవత్సరాలు
  • వయస్సు గణన: జూలై 1, 2026 నాటికి.

స్థానికత నిబంధనలు

  • పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డులో నివసించే మహిళలు మాత్రమే అర్హులు.
  • గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో నివసించే మహిళలు అర్హులు.
  • గిరిజన తండాలు, గూడేలు, ఆవాసాల్లోని పోస్టులకు సంబంధిత ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులు.
  • ఎస్సీ వాడల పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలు మాత్రమే అర్హులు.

ఎంపిక విధానం

100 మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Advertisement
  • ఇంటర్ మార్కులకు – 70 మార్కులు
  • ఇంటర్వ్యూ – 10 మార్కులు
  • అనాథలకు – 10 మార్కులు
  • వితంతువులకు – 5 మార్కులు
  • దివ్యాంగులకు – 5 మార్కులు

ఇంటర్వ్యూలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది.

అవసరమైన ధ్రువపత్రాలు

  • పుట్టిన తేదీ / వయస్సు ధ్రువీకరణ
  • కుల ధ్రువీకరణ పత్రం
  • ఇంటర్ మార్కుల మెమో
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • సదరం సర్టిఫికేట్ (దివ్యాంగులకు)
  • భర్త మరణ ధ్రువీకరణ పత్రం (వితంతువులకు)
  • అనాథ ధ్రువీకరణ పత్రం (అనాథలకు)

దరఖాస్తు విధానం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • చివరి తేదీ: 15 ఆగస్టు 2026

Karimnagar Anganwadi Job Notification

Official Website

Online Applications

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →